- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాదె ఇన్నయ్య కేసులో ముగిసిన దర్యాప్తు.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA
మాజీ మావోయిస్టు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య (ఇన్నా రెడ్డి) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: సామాజిక ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య (Gade Innayya) కేసులో దర్యాప్తు ముగిసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ (NIA) నాంపల్లి కోర్టులో ఇవాళ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు మద్దతుగా ప్రచారం చేయడం UAPA చట్టాన్ని ఉల్లంఘింన ఆరోపణతో 2025, డిసెంబ్ 21న ఇన్నారెడ్డిని జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలంలో ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా మరణించిన మావోయిస్టు నేత రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు హాజరుకావడం, మావోయిస్టులకు అనుకూలంగా ప్రసంగాలు చేయడం, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటం వంటి ప్రధాన అభియోగాలను ఏన్ఐఏ ఆయనపై మోపింది. ఈ కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇన్నయ్యకు.. తాజాగా నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు 2 నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, కేసులో విచారణ ముగిసిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఛార్జ్‌షీటు దాఖలు చేశారు.






