- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిరాతంగా చంపి చేతులుదులుపుకుంటారా: పోలీసులపై జగన్ సంచలన ఆరోపణలు
వైసీపీ కార్యకర్త సాయికృష్ణను కిరాతంగా చంపితే సీఐను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటారా అని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సాయికృష్ణ తల్లిని పరామర్శించిన ఆయన సీఐ, ఏసీపీ, సీపీపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ కార్యకర్త సాయికృష్ణ(YCP activist Saikrishna)ను కిరాతంగా చంపితే సీఐను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటారా అని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) అన్నారు. సాయికృష్ణ తల్లిని పరామర్శించిన ఆయన సీఐ, ఏసీపీ, సీపీపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ ఘటనలో సీఐ నాగరాజును సస్పెండ్ చేశారంటే చంపేశాడనే కదా అర్ధం అని జగన్ వ్యాఖ్యానించారు. సాయికృష్ణ తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతోనే వేరే దారి లేక సీఐ నాగరాజును సస్పెండ్ చేశారని తెలిపారు. అన్యాయం జరిగిందని సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే బేరాలాడుతున్నారని జగన్ ఆరోపించారు.
డీజీపీ ప్రమేయం ఉంది..
ఈ వ్యవహారంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta) ప్రమేయం కూడా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. సాయికృష్ణ మిస్సింగ్‌పై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టలో పడేశారని చెప్పారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రెండు ఘటనలు జరిగితే సీపీ, ఏసీపీ, సీఐ పరస్పరం కాపాడుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. కొందరు పోలీసులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, అందువల్లే ఈ ఘటనలు జరిగాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.






