- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత హాట్ కామెంట్స్.. ఆ రోజు ఏం జరిగిందో రివీల్ చేసిన టీఆర్ఎస్ చీఫ్
బీఆర్ఎస్ పార్టీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ మనుగడలో ఉందంటే అది నా వల్లేనన్నారు. నేను జైల్లో ఉన్నప్పడు పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటున్నామనే ప్రతిపాదనతో కొంతమంది నా వద్దకు వచ్చారని కానీ నేను అలా చేయవద్దని స్ట్రాంగ్‍గా నిలబడ్డానని చెప్పారు. నేను ఏ తప్పు చేయలేదని ఏదో ఒకరోజు బెయిల్‍పై బయటకు వస్తానని పార్టీని త్యాగం చేయవద్దని వారితో చెప్పినట్లు తెలిపారు. తాజాగా ఓ జాతీయ చానెల్‍కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన కవిత.. ఇవాళ ఆ పార్టీ నేతలు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతుండవచ్చు కానీ పార్టీ మనుగడ కోసం జైల్లో నా ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి నేను సిద్ధం అని పార్టీతో చెప్పానన్నారు. పార్టీ ఓటమికి తానే కారణం అని వస్తున్న ఆరోపణలను కవిత ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చర్చ అంతా ప్రభుత్వ వైఫల్యాల గురించే జరిగిందని కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదన్నారు. బీఆర్ఎస్ లో తాను పక్షపాతాన్ని, అవమానాన్ని చవి చూశానన్నారు.
బీఆర్ఎస్‍తో విభేదాలకు అది కూడా ఓ కారణం:
బీఆర్ఎస్ పార్టీ నుంచి తాను బయటకు రాలేదని తనను బయటకు పంపించేశారని కవిత అన్నారు. అంతర్గతంగా గొడవలు జరుగుతూనే ఉండేవని అయితే నేను ఎప్పుడూ వాటిని పరిష్కరించుకోవాలనే కోరుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చెడ్డ పనులే చేయలేదని కానీ ప్రధానమైన హామీలు నెరవేర్చకపోవడం లోటుగానే ఉండేదన్నారు. తాను జైలుకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఉద్యమానికి బలంగా మద్దతు ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ పార్టీతో విభేదాలకు ప్రధాన కారణాలలో ఒకటి అన్నారు. బీసీ ఉద్యమానికి మద్దతు ఆపాలని ఒత్తిడి వచ్చింది. కానీ ఈ దేశంలో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోటా అనేది తప్పకుండా జరగాలని బలంగా నమ్మానన్నారు. ఈ విషయంలో తాను మాట్లాడుతుండగా ఒక రోజు నా వివరణ తీసుకోకుండానే నన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేశారన్నారు. వెంటనే పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
నాముందున్న ఏకైక మార్గం అదే
అనంతరం తాను ప్రజాజీవితంలో కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ ప్రజావితంలో కొనసాగాలంటే రాజకీయాల కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. దీంతో తన ముందు ఉన్న మార్గాల గురించి ఆలోచించాను. బీజేపీ విషయానికొస్తే వాళ్లు తెలంగాణ కోసం అసలు ఏమీ చేస్తారని అనిపించడం లేదని, కాంగ్రెస్ పని తీరు ప్రస్తుతం ఎంత దారుణంగా ఉందో మనం చూస్తూనే ఉన్నామన్నారు. బీఆర్ఎస్ ఆప్షన్ కాదు. అందువల్ల నేను సొంతంగా బయలుదేరడమే నాకు మిగిలిన ఏకైక మార్గం అన్నారు. నన్ను జైలుకు పంపడానికి మూడు సంవత్సరాల ముందు బీజేపీ సోషల్ మీడియా నన్ను దారుణంగా వేధించిందని చెప్పారు. బతుకమ్మ పండగను నేను చాలా పవిత్రంగా ఆచరిస్తానని ఆ 9 రోజులు నేను ఉపవాస దీక్షలో ఉంటాను. కానీ బీజేపీ సోషల్ మీడియా నేను బతుకమ్మ పెట్టుకునే తలమీద మద్యం సీసాలు పెట్టి ఫోటోలను మార్ఫింగ్ చేస్తే పార్టీ స్పందించలేదన్నారు. తనపై వస్తున్న వేధింపులపై పార్టీ నాయకత్వం స్పందించాలని నేను అభ్యర్థించినా వారు స్పందించలేదన్నారు.
జైలు నుంచి బయటకు వచ్చాక కూడా..
బెయిలుపై బయటకు వచ్చాక కూడా గులాబీ కండువా వేసుకునే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం పని చేసినట్లు కవిత చెప్పారు. నా వైపు నుండి నేను ఏ తప్పూ చేయలేదు. కానీ వాళ్లకు ఏమినచ్చలేదో నాకు తెలియదు. నా పని నేను చేసుకుంటుండగా ఒక రోజు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారన్నారు. పార్టీ కేటీఆర్‍ను ప్రమోట్ చేయాలనుకుందేమో అందుకే కేటీఆర్‍పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ మొత్తం స్పందించింది. దాంతో పార్టీలోని అందరికీ ఒకే రకమైన స్పందన ఎందుకు ఇవ్వడం లేదని నేను అడిగానన్నారు. బీజేపీ నన్ను తప్పుడు ఆరోపణలతో వేధిస్తుంటే ఈ విషయంలో మాట్లాడలేదు కానీ కేటీఆర్ విషయంలో స్పందించారని, దీంతో చివరకు ఇది పితృస్వామ్యం అని నేను అనుకున్నానన్నారు. తిరిగి కేసీఆర్ వెనక్కి రమ్మని పిలిచినా ఇప్పుడు నేను వెళ్లలేనని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్‍పై..
తెలంగాణలో పవన్ కల్యాణ్ పోటీ చేయడాన్ని మేము ఎప్పడూ వ్యతిరేకించలేదని ఆయన ధ్వంధ్వ వ్యాఖ్యలనే వ్యతిరేకిస్తున్నామన్నారు. తమను హైదరాబాద్‍కు రానివ్వడం లేదని జాతీయ మీడియాలో చెబుతున్న పవన్ కల్యాణ్.. వారానికి మూడు రోజులు హైదరాబాద్‍లోనే ఉంటున్నారన్నారు. ఆయనే కాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వారంలో 2 రోజులు ఇక్కడే ఉంటున్నారు. రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం ముట్టలేదని చెప్పిన పవన్ కల్యాణ్.. తెలంగాణ వ్యతిరేకి అని మేము బలంగా నమ్ముతున్నామన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు పవన్ కల్యాణ్ ను ఓడిస్తారన్నారు. తెలంగాణ ప్రాంతీయ వాదాన్ని ఉగ్రవాదంతో పోలుస్తున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టాడానికి మీరు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. పోటీ చేయాలనుకుంటే పోటీ చేయనివ్వండి కానీ మా ఉద్యమాన్ని అవమానించ వద్దన్నారు. ఆయన పోటీ చేయాలనే ఉద్దేశం అతడికి లేదని కేవలం గొడవ సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ నీటి పంపకాల్లో సమస్య తలెత్తితే పవన్ కల్యాణ్ ఎటువైపు నిలబడతారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎంవోయూల సీఎం అని ఎద్దేవా చేశారు. ఆయన ఒప్పందాలు కుదుర్చుకోవడం తప్ప ప్రజలకు చేసేదేమి లేదని చెప్పుకొచ్చారు.






