- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGPSC: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ‘డైట్’ లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
తెలంగాణలో 86 ‘డైట్’ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్‌సీ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపంకున్నది. ఉపాధ్యాయ శిక్షణ రంగంలో కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) భారీ తీపికబురు అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (DIET) ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్‌సీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 86 డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సీనియర్ లెక్చరర్ పోస్టులు 23, లెక్చరర్ పోస్టులు 63 ఉన్నాయి. ఈ పోస్టులకు గాను జూన్ 24 నుంచి జూలై 29 వరకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. వయోపరిమితి, విద్యా అర్హతలు, ఫీజు, సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్‌ను కమిషన్ త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. చాలాకాలంగా డైట్ లెక్చరర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశమే.






