విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

by Taduka Kalyani |

విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు.

విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
X

దిశ, ఆసిఫాబాద్: విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. గురువారం ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలోని కళావతి ట్రేడర్స్ ఫెర్టిలైజర్ షాపును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపులోని విత్తనాలు, ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, విత్తనాల ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అందించాలని షాపు నిర్వాహకులకు సూచించారు. అలాగే, అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను రైతులకు స్పష్టంగా తెలిసేలా షాపు వెలుపల నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ ఇన్‌పుట్ల విక్రయంలో పారదర్శకత పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించే ఫెర్టిలైజర్, విత్తనాల దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత స్పష్టం చేశారు.

Next Story