- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిలాఫలకం కూల్చివేతపై కవ్వంపల్లి ఆగ్రహం
శిలాఫలకం కూల్చివేతపై కవ్వంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, శంకరపట్నం: రూ. 41 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో శంకరపట్నం మండలంలోని ధర్మారం గ్రామంలో మానకొండూరు శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దానిలో భాగంగానే గ్రామాల్లో అవస్థాపన సౌకర్యాల్లోని ముఖ్యమైన రోడ్ల అభివృద్ధికి అధిక నిధులను కేటాయించిందని తెలిపారు. గ్రామాల్లో మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
శిలాఫలకం కూల్చివేత పై ఆగ్రహం
అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకంను బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేసిన సంఘటన చోటు చేసుకుంది. దీనితో గురువారం ఉదయం అగా మేఘాల మీద నూతన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సీరియస్ అయ్యారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టేది లేదని, చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు.
మహిళా సర్పంచ్ కు బెదిరింపులు
ధర్మారం గ్రామ సర్పంచ్ చింతి రెడ్డి పద్మ మాట్లాడుతూ గ్రామానికి చెందిన కొంతమంది తనను బెదిరిస్తున్నట్లు వాపోయింది. గ్రామాభివృద్ధికే తాను రాజకీయాల్లోకి వచ్చానని కొందరు కావాలనే తనను బదనాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.,గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని కవ్వం పల్లి గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతి రెడ్డి పద్మ, ఎంపీఓ ప్రభాకర్,కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బండారి తిరుపతి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, టిపిసిసి సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాజీ మండలాధ్యక్షుడు బసవయ్య,జిల్లా కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






