- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమిత్ షా ఫొటోతో చిక్కుల్లో దర్శకుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు
by Bhoopathi Nagaiah |
దిశ, సినిమా : లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఫిల్మ్ మేకర్ అవినాష్ దాస్‌ను లీగల్ ట్రబుల్స్‌లోకి నెట్టింది.

X
దిశ, సినిమా : లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఫిల్మ్ మేకర్ అవినాష్ దాస్‌ను లీగల్ ట్రబుల్స్‌లోకి నెట్టింది. జైలులో ఉన్న ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్న ఫొటోను షేర్ చేసినందుకు అవినాష్‌ను అదుపులోకి తీసుకున్నారు గుజరాత్ పోలీసులు. తదుపరి లీగల్ ప్రాసెస్ కోసం గుజరాత్ తరలించినట్లు తెలిపారు. కాగా ఫోర్జరీ, జాతీయ గౌరవ అవమానం నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 469 కింద అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఈ వివాదాస్పద ఫొటోలో పూజా సింఘాల్, అమిత్ షా ఏదో గుసగుసలాడుతున్నట్లు కనిపించింది. కాగా మనీలాండరింగ్ కేసులో సింఘాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడానికి కొన్ని రోజుల ముందే ఈ పిక్ క్లిక్ చేసినట్లు సమాచారం.
Next Story






