- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
18వ రోజుకు చేరిన భీకర యుద్ధం.. అత్యాధునిక క్షిపణులతో ఇరాన్ విలయం!
18వ రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. హైపర్ సోనిక్ క్షిపణులతో ఇరాన్ విధ్వంసం. ధ్వని కంటే 15 రెట్ల వేగంతో దూసుకెళ్తున్న 'ఫత్తా-2' క్షిపణులు.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. అయినప్పటికి వారి మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ తన అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి శత్రు దేశాలపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల 'సెజ్జిల్' క్షిపణులు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు, కేవలం 15 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే ప్రయోగానికి సిద్ధమయ్యే 'ఖైబర్ షెకాన్' బాలిస్టిక్ మిస్సైళ్లతో గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది.
ఈ యుద్ధంలో ఇరాన్ ప్రయోగిస్తున్న 'ఫత్తా-2' హైపర్ సోనిక్ క్షిపణి ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ధ్వని వేగం కంటే 15 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ, శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. అగ్రరాజ్యాల రక్షణ కవచాలను సైతం ఛేదించగల ఈ అధునాతన టెక్నాలజీతో ఇరాన్ యుద్ధ రంగంలో తన పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. గత 17 రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధం కారణంగా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.






