- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుకు కన్నీరు.. సకాలంలో అందని ఎరువులు
కౌలు రైతుల కష్టాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : కౌలు రైతుల కష్టాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. సకాలంలో ఎరువులు అందక, సరైన సమయంలో పంటలు అమ్ముకోలేక భూమి పట్టాదారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పడరాని పాటుపడుతున్నారు. ప్రభుత్వం ఎరువులు కొనడానికి పంట అమ్ముకోవడానికి కొత్త చట్టాలు తీసుకురావడం కౌలు రైతుల పాలిట శాపంగా మారింది. కౌలు రైతులు ఎరువుల కోసం షాప్ ల వద్ద అమ్మకాలు లేకపోవడంతో షాపుల వద్ద ఎరువులు నమోదు చేసుకోవడానికి నానా తంటాలు పడవలసి వస్తుంది. భూమి కౌలుకు ఇచ్చిన రైతు వద్దకు వెళ్లియాప్ లో ఎరువులను నమోదు చేసుకోవడానికి వారిని అడగవలసిన పరిస్థితి ఏర్పడింది. వరి ,పత్తి పంట అమ్ముకోవాలన్న మిల్లుల వద్ద పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకొని వెళ్లి ఓటీపీలు చెప్పినప్పుడే పత్తిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది దీంతో కౌలు రైతులు పట్టాదారుల చుట్టూ పట్టా పారు పాసు బుక్కులు ఉన్న రైతుబంధువులకు వెళ్లి వారి పేర్ల పైనే పంటలు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది రైతులు వారి ఖాతాలో డబ్బులు పడినప్పటికీ కౌలు రైతులకు డబ్బులు ఇవ్వక వారు చుట్టూ తిప్పుకొని కమీషన్లు కట్ చేసుకుని డబ్బులు ఇచ్చిన సంఘటనలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి.
దీంతో రైతులు మింగలేక కక్కలేక ఏమి చేయలో పాలు పోక దీనావస్త పరిస్థితుల్లో ఉన్నారు. జిల్లాలో 1,17,950 మంది భూమి పట్టాదారు ఉన్న రైతులు ఉన్నారు. ఇందులో సగానికి పైగా రైతులు హైదరాబాద్ వరంగల్ పట్టణాల్లో ఉండగా కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగ నిమిత్తమై వేరే జిల్లాలోకి వెళ్లిపోయారు. 50 శాతం మంది రైతులు మాత్రమే తమ భూమిని దున్నుకుంటూ వ్యవసాయం చేస్తుండగా మిగతా 50 శాతం మంది పట్టాదారులు భూములను కౌలుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. కౌలుకు ఇచ్చిన రైతులకు కౌలుతో పాటు ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా సైతం వారికి ప్రభుత్వం ఖాతాలో జమ చేస్తుంది. పట్టాదారు రైతులు రెండు రకాల లబ్ధి పొందుతుండగా కౌలు రైతులు మాత్రం కేవలం పంట పండించుకొని వచ్చిన దిగుబడితో వారు తమ బ్రతుకును సాగదీయవలసి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కౌలు రైతులకు రైతు భరోసాతో పాటు పంట అమ్ముకోవడానికి అవసరమైన మార్పులు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇంతవరకు కౌలు రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చిన ఫలాలు ఏమి లేదు. కనీసం కౌలు రైతులకు ప్రభుత్వం ఎరువులు సరఫరా చేసినా వారు పండించిన పంటను ఆధార్ కార్డు ప్రకారం అమ్ముకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది.
అప్పుల ఊబిలో..
ప్రభుత్వం రైతులకు కౌలు రైతుల పత్రం ఇచ్చి దానితో ఎరువులు,కొనుగోలు చేసుకుని పంటను అమ్ముకునే అవకాశం కల్పిస్తే కౌలు రైతులు కొంతమేరకైనా ఆదాయం పొందే అవకాశాలున్నాయి. కాగా కౌలు రైతులు ఎకరానికి 20 నుంచి 50 వేల వరకు ప్రతి సంవత్సరం కౌలు సొమ్ము ముందస్తుగానే చెల్లిస్తున్నారు. గత ఏడాది కౌలు రైతులకు కన్నీరే మిగిలింది. వరి, పత్తి పంటల్లో దిగుబడి రాకా పంటకు ధర లేకపోవడంతో చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దానికి తోడు పంటలు అమ్ముకునే పరిస్థితి లేక కౌలు రైతులకు కన్నీరుగా విలపించారు. ఈ ఏడదైనా కౌలు రైతులకు పంట దిగుబడి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ముందస్తుగానే పట్టదాలకు కౌలు చెల్లించి వ్యవసాయం చేయడానికి సన్నద్ధమయ్యారు.
ప్రభుత్వాలు ప్రతిసారి కౌలు రైతులను ఆదుకుంటామని హామీలు ఇస్తున్న తప్ప వారిని ఆదుకున్న ప్రభుత్వాలు ఇంత వరకు లేదు. వ్యవసాయ అధికారులు కౌలు రైతుకు కౌలు రైతు పత్రం ఇచ్చి బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తామని చెప్పిన హామీలు ఇంతవరకు నెరవేరలేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద మూడు నుంచి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి పండిన పంట అంతా వ్యాపాలికే చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ కూలీకి వెళ్లలేక కొంతమంది పట్టాదారుల భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ అప్పుల ఊబిలో మునిగి పోయారు.ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని కౌలు రైతులు పంటలు అమ్ముకోవడానికి ఎరువులు కొనడానికి బ్యాంకుల్లో రుణాలు ఇప్పించే విధంగా అవకాశాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.






