ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బస్సు.. ప్రమాదంలో 20మంది?

by Naga Rani Yarlagadda |

రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని 40 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బస్సు.. ప్రమాదంలో 20మంది?
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని 40 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఉదయగిరి డిపోకు చెందిన బస్సు మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా.. ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 10 మందికి తీవ్ర గాయాలు అవ్వగా.. క్షతగాత్రులందరినీ స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయింది. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story