- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటు ఆంటీతో ఇటు అమ్మాయితో.. కట్ చేస్తే చెరువులో తేలిన శవం
ఆంటీతో ప్రేమకోసం ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయినే హతమార్చాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జిల్లాలో బిడ్డిక ఉషారాణి (32) గిరిజన యువతి హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఆంటీతో ప్రేమకోసం ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయినే హతమార్చాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జిల్లాలో బిడ్డిక ఉషారాణి (32) గిరిజన యువతి హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రేమించినవాడే అమ్మాయి ప్రాణం తీసినట్టు తేలింది. వివరాల్లోకి వెళితే.. మన్యం జిల్లా పాలకొండ మండలం బర్న సీతంపేటకు చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణికి ఎం. సింగాపురానికి చెందిన భువనేశ్వర్ 25 అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్లుగా పనిచేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా కొంతకాలానికి ప్రేమగా మారడంతో పాటు శారీరక సంబంధానికి దారితీసింది. అయితే భువనేశ్వర్ ఓవైపు ఉషారాణితో ప్రేమాయణం కొనసాగిస్తూనే ఎం. సింగుపురం పీహెచ్‌సీలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న కృపారాణికి దగ్గరయ్యాడు.
అప్పటికే కృపారాణికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య సైతం వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం కాస్తా భువనేశ్వర్ ప్రియురాలు ఉషారాణికి తెలిసిపోయింది. అప్పటి నుండి కృపారాణితో సంబంధం తెంచుకోవాలని, తనను పెళ్లి చేసుకోవాలని ఉషారాణి భువనేశ్వర్ ను ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మరోవైపు ఉషారాణి గిరిజన యువతి కాగా భువనేశ్వర్ బీసీ సామాజికవర్గానికి చెందినవాడు. దీంతో ఆ యువతిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని భావించాడు. దానికి తన మరో ప్రియురాలైన స్టాఫ్ నర్స్ కృపారాణితో కలిసి పథకం రచించాడు. స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న కృపారాణి భువనేశ్వర్ కు నిద్రమాత్రలు ఇస్తే సులభంగా చనిపోతుందని చెప్పి అతడికి మాత్రలు కూడా ఇచ్చింది.
భువనేశ్వర్ పథకం ప్రకారం ఈనెల 6వ తేదీన ఉషారాణికి ఫోన్ చేసి ఒడిశాలోని రాయిఘడ ఆలయానికి దర్శనానికి వెళదామని చెప్పి పిలిచాడు. అతడి మాటలు నమ్మి వచ్చిన యువతికి కారులో వెళుతుండగా కూల్ డ్రింక్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. మత్తులోకి జారుకున్పటికీ ఉషారాణి చనిపోకపోవడంతో మరోసారి తన ప్రియురాలు కృపారాణికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఈ సారి ముక్కు, నోరు మూసేసి చంపేయాలని ఐడియా ఇచ్చింది. తాను శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తుడ్డలి వద్ద ఉన్నానని చెప్పడంతో అక్కడకు వెళ్లి కృపారాణిని పికప్ చేసుకున్నాడు.
భువనేశ్వర్ తో పాటు అతడి కజిన్ తేజేశ్వరరావు కూడా కారులో వెళ్లగా.. కృపారాణిని కారు ఎక్కించుకుని కొల్లివలస వద్ద ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లారు. మత్తులో ఉన్న ఉషారాణి ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని ఓ రాయికి కట్టి చెరువులో పడేశారు. మరుసటి రోజు ఉషారాణి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే రోజు సాయంత్రం చెరువులో డెడ్ బాడీ బయటపడింది. పోలీసులు ఆమె మృతదేహం ఉషారాణిదే అని గుర్తించి విచారణ ప్రారంభించారు. నిందితులు భువనేశ్వర్ తో పాటు కృపారాణి, వారికి సహకరించిన తేజేశ్వరరావును అరెస్ట్ చేశారు.






