- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RAIN ALERT: తెలంగాణకు భారీ వర్షసూచన.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవాకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తరతెలంగాణ, పశ్చిమ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవాకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తరతెలంగాణ, పశ్చిమ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
మిగితా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అదే విధంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని, మరికొన్ని ప్రాంతాల్లో పొడివాతావరణం ఉంటుందని అంచనావేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండల ప్రభావం కూడా దాదాపుగా తగ్గిపోయింది. అయితే వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.






