‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌పై బిగ్ ట్విస్ట్.. కారణాలు ఇవే

by Pulgam srinivas |

‘ది ప్యారడైజ్’ సినిమా రిలీజ్ డేట్ మరోసారి మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌పై బిగ్ ట్విస్ట్.. కారణాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో భారీ క్రేజ్ ఉన్న సినిమాలు విడుదల తేదీల విషయంలో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. సినిమా ప్రారంభమైన వెంటనే మేకర్స్ ఒక రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తున్నప్పటికీ, ఆ తేదీకే విడుదలయ్యే సినిమాల సంఖ్య చాలా తక్కువగానే ఉందని చెప్పాలి. ఆ జాబితాలో నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా కూడా చేరినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాను ప్రారంభించిన సమయంలోనే మేకర్స్ ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆగస్టు 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆ తేదీన కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సెప్టెంబర్‌లో సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఆ సమయంలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉండటంతో కలెక్షన్లపై ప్రభావం పడొచ్చని భావిస్తున్న మేకర్స్ ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఏదైనా కారణంతో ఆ తేదీ కూడా మిస్ అయితే డిసెంబర్ 4 లేదా 11 తేదీల్లో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల తేదీపై ప్రస్తుతం అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story