- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రిపై నిండు సభలో చిందులు తొక్కిన మహిళా అధికారి
నిండు సభలో ప్రసంగిస్తున్న మంత్రిపై చిందులు తొక్కింది ఓ మహిళా అధికారి.

దిశ, వెబ్ డెస్క్ : నిండు సభలో ప్రసంగిస్తున్న మంత్రిపై చిందులు తొక్కింది ఓ మహిళా అధికారి. మహారాష్ట్రలో జనవరి 26, 2026న జరిగిన రిపబ్లిక్ డే అధికారిక వేడుకల్లో అటవీ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ ఇచ్చిన ప్రసంగంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ పేరును ప్రస్తావించకపోవడంపై ఫారెస్ట్ ఆఫీసర్ మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి రాజ్యాంగం, స్వాతంత్ర్యం, దేశ భద్రత, అభివృద్ధి వంటి అంశాలపై మాట్లాడినా అంబేద్కర్ పేరు ఒక్కసారి కూడా చెప్పకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. సరాసరి ఆమె స్టేజి మీదకి వెళ్లి మంత్రిని నిలదీశారు.
"రాజ్యాంగం ఇచ్చిన బాబాసాహెబ్ పేరు లేకుండా రిపబ్లిక్ డే ప్రసంగం ఇవ్వడం పెద్ద అవమానం, అంబేద్కర్ ను మరిచి రిపబ్లిక్ డే జరుపుకునే అర్హత ఎవరికీ లేదు" అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. మరోవైపు మంత్రి గిరీష్ మహాజన్ వివరణ ఇస్తూ.. ఇది కావాలని చేసింది కాదని.. ప్రసంగంలో రాజ్యాంగ రక్షణ, దేశ భద్రతపై దృష్టి పెట్టామని వివరణ ఇచ్చారు. అంబేద్కర్ కు మహారాష్ట్రలో ఉన్న భారీ అభిమాన వర్గం కారణంగా ఈ ఘటన రాజకీయంగా కూడా పెద్ద చర్చగా మారింది.






