ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

by Batti.Sumithra |

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్లాపురం మధు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
X

దిశ, సిద్దిపేట అర్బన్ : తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్లాపురం మధు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25 శాతం పేద విద్యర్ధులకు ఉచిత విద్యను అందించాలన్నారు.

ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థుల మెస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బీసీ, ఎస్సీ కాలేజీ హాస్టల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ లోని ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనం నిర్మించాలన్నారు. కలెక్టరేట్ ను ముట్టడించిన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story