Fatty liver: చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు పట్టిపీడిస్తోన్న ఫ్యాటీ లివర్.. ఇలా చేయాల్సిందేనంటున్నారు నిపుణులు?

by Kodari Anjali |

ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఫ్యాటీ లివర్ సమస్య పట్టిపీడిస్తోంది.

Fatty liver: చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు పట్టిపీడిస్తోన్న ఫ్యాటీ లివర్.. ఇలా చేయాల్సిందేనంటున్నారు నిపుణులు?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఫ్యాటీ లివర్ సమస్య పట్టిపీడిస్తోంది. ఫ్యాటీ లివర్‌కు సంబంధించిన లక్షణాలు చూసినట్లైతే.. అలసట, జీర్ణ సమస్యలు, గ్యాస్, జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు నొప్పి లేదా వాపు, వికారం,రక్తహీనత, తల తిరగడం, తేలికపాటి పొత్తికడుపు అసౌకర్యం, బలహీనత వంటివి ఫ్యాటీ లివర్ సమస్యలు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోతే ఈ వ్యాధి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధి పిల్లలు, యువకులు, మధ్య వయస్కులలో వస్తుంది. ముఖ్యంగా బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అధిక బరువు ఉంటే.. ఆల్కహాల్ అతిగా సేవిస్తే అధిక బరువు, ముఖ్యంగా బొడ్డు కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వీటితో పాటుగా ఇన్సులిన్ నిరోధకత, అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి ఇతర పరిస్థితులతో కూడా సంబంధం కలిగి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. సమ్‌టైమ్స్ ఫైబ్రోసిస్ అలాగే సిర్రోసిస్ వంటి అధునాతన కాలేయ వ్యాధికి కారణం అవుతుంది.

అయితే ఈ ఫ్యాటీ లివర్‌ను తగ్గించడానికి ఆహారంలో మార్పులు చేయాలని నిపుణులు చెబుతుంటారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్, మద్యపానం వంటి అలవాట్లు మానేయాలి. వారానికి కనీసం 135 డేస్ వ్యాయామం చేయాలి. చక్కెర, శుద్ధి చేసిన ధాన్యాలు, అనారోగ్య కొవ్వులను తగ్గించాలి. అలాగే బచ్చలికూర, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఫైబర్ పుష్కలంగా ఉండే క్యారెట్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story