విధి నన్ను వెక్కిరించింది.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ నటుడు షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-22 08:01:41  IST  )

టాలీవుడ్‌లో యూత్ ఫుల్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ‘ఈ నగరానికి ఏమైంది’.

విధి నన్ను వెక్కిరించింది.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ నటుడు షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో యూత్ ఫుల్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2018లో విడుదలై ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ‘ene repeate’ రాబోతోందని ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించడంతో సినీ ప్రియులు పండగ చేసుకున్నారు. వివేక్, కౌశిక్, కార్తీక్, ఉప్పి పాత్రలను మళ్ళీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఒక బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి కీలక నటుడు సుశాంత్ రెడ్డి(Sushanth Reddy) (కార్తీక్) తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయంపై స్పందిస్తూ సుశాంత్ ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. "ఈ నగరానికి ఏమైంది సినిమా ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఈ చిత్రం నాకు ఎంతో మంది స్నేహితులను, మధుర జ్ఞాపకాలను ఇచ్చింది. నాకు నటన అంటే ప్రాణం, అందుకే నటుడిగానే ఉండాలనుకున్నాను. కానీ విధి మరోలా తలచింది.

ఈ రంగంలో కొనసాగడం అంత సులభం కాదు. నా నిర్ణయాన్ని ఎందరో వ్యతిరేకించినా, నా మనసు మాట విని నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అయితే సినిమా వచ్చి 8 ఏళ్లు కావస్తోంది, ఈలోగా నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలను, నా వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేయడం కష్టంగా మారింది. అందుకే ఈ సీక్వెల్ నుండి తప్పుకోవాలని కఠిన నిర్ణయం తీసుకున్నాను" అని సుశాంత్ వివరించాడు. తన స్థానంలో రాబోయే కొత్త కార్తీక్‌ను ప్రేక్షకులు తప్పకుండా ప్రేమిస్తారని, తరుణ్ భాస్కర్ టేకింగ్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని సుశాంత్ పేర్కొన్నాడు. చిత్ర బృందాన్ని, షూటింగ్ వాతావరణాన్ని తాను చాలా మిస్ అవుతానని చెబుతూ, తానూ ఒక ప్రేక్షకుడిలా థియేటర్లో సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ ప్రకటనతో ‘ఈ నగరానికి ఏమైంది’ అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నా, సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి మాత్రం తగ్గలేదు.

Read More..

ఆ విషయంపై ఎట్టకేలకు మౌనం వీడిన తరుణ్ భాస్కర్.. చర్చనీయాంశంగా మారిన ఇన్‌స్టా పోస్ట్

Next Story