ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన ఒక కుటుంబం ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై కారులో ప్రయాణిస్తుండగా, దౌసా సమీపంలోని బాండికుయ్ (Bandikui) వద్దకు రాగానే ముందు వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు ట్రక్కు కిందకు దూసుకెళ్లి సుమారు 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లబడింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులంతా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నివాసితులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి పంపారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Next Story