ఘోర రోడ్డు ప్రమాదం.. అంతర్జాతీయ షూటర్ శంభాజీ పాటిల్ దుర్మరణం

by Malleboina Mahesh |

నేషనల్ హైవే పై జరిగిన ఘో రోడ్డు ప్రమాదంలో భారత షూటింగ్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. అంతర్జాతీయ పిస్టల్ షూటర్ శంభాజీ పాటిల్ (27) మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. అంతర్జాతీయ షూటర్ శంభాజీ పాటిల్ దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ హైవే పై జరిగిన ఘో రోడ్డు ప్రమాదంలో భారత షూటింగ్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. అంతర్జాతీయ పిస్టల్ షూటర్ శంభాజీ పాటిల్ (Pistol shooter Sambhaji Patil) మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం (road accident)లో మరణించారు. ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 2016 జూనియర్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించి దేశానికి పేరు తెచ్చిన ఈ యువ క్రీడాకారుడు అకాల మరణం చెందడం క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదం సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది. శంభాజీ పాటిల్ తన స్నేహితుడు (ఆయన కూడా ఒక షూటర్) నడుపుతున్న టయోటా ఫార్చ్యూనర్ కారులో షూటింగ్ ప్రాక్టీస్ కోసం గుజరాత్ వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కాగా, శంభాజీ పాటిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న ఆయన స్నేహితుడు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శంభాజీ పాటిల్ మరణించడం భారత షూటింగ్ రంగానికి తీరని లోటు. చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను చాటిన ఆయన, భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి ఈవెంట్లలో పతకాలు సాధిస్తారని అందరూ ఆశించారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడాకారులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story