- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. ట్రాక్టర్-పికప్ వాహనం ఢీకొని ఐదుగురు మృతి
పండగపూట రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని బెరాసియాలో చోటుచేసుకుంది.

దిశ. వెబ్ డెస్క్: పండగపూట రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని బెరాసియాలో చోటుచేసుకుంది. ఒక ట్రాక్టర్-ట్రాలీ, పికప్ వాహనం ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెరాసియా పరిధిలోని విద్యా విహార్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా పికప్ వాహనంలో ప్రయాణిస్తున్న వారని ప్రాథమిక సమాచారం అందుతోంది. మృతులను సిరోంజ్ నివాసితులు ముఖేష్ అహిర్వర్ (40), బాబ్రీ బాయి (60), దీపక్ (14), లక్ష్మీ బాయి (60), హరి బాయి (60)గా గుర్తించినట్లు అధికారి తెలిపారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగారు. బెరాసియా ఎస్‌డిఎం (SDM) అశుతోష్ శర్మ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ, మృతుల సంఖ్యను ధృవీకరించారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






