- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డుపై పార్క్ చేసిన మరో బస్సును వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. దిందో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్ డెస్క: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డుపై పార్క్ చేసిన మరో బస్సును వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. దిందో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఆదివారం తెల్లవారుజామున తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు సమీపంలో తిరుచ్చి-మదురై జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, చెన్నై నుంచి మదురై వెళ్తున్న ఒక ప్రైవేట్ ఓమ్నీ బస్సు టీ తాగడం కోసం రహదారి పక్కన ఆపి ఉంచారు. ఆ సమయంలో అదే మార్గంలో చెన్నై నుంచి మార్తాండం వైపు వెళ్తున్న మరో ఓమ్నీ బస్సు అదుపు తప్పి, ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, కొట్టంపట్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర ప్రభావంతో జరిగిన ఈ ఢీకొనడం వల్ల బస్సు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.






