ఘోర ప్రమాదం: అంబులెన్స్-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి

by Malleboina Mahesh |

అస్సాం సోనిత్‌పూర్ జిల్లా NH-15పై ఘోర ప్రమాదం. అంబులెన్స్-ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి. మృతుల్లో తులిప్ టీ గార్డెన్ రోగి మరియు డ్రైవర్.

ఘోర ప్రమాదం: అంబులెన్స్-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలో అర్థరాత్రి వేళ పెను విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నేషనల్ హైవే-15 (NH-15) పై ఒక అంబులెన్స్, ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీ కొనడంతో ఒకే కుటుంబానికి చెందిన వారు సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రోగి, అంబులెన్స్ డ్రైవర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం ధేకియాజులి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తులిప్ టీ గార్డెన్ (Tulip Tea Garden) నుండి ఒక రోగిని తీసుకుని అంబులెన్స్ అత్యవసరంగా వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే, అంబులెన్స్ అతివేగమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఘటనాస్థలిలోనే నలుగురు మరణించగా, ఆస్పత్రికి తరలించే క్రమంలో మరో ముగ్గురు కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Next Story