- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 100 అడుగులకంటే లోతైన లోయలో పడిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా కల్సి ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 100 అడుగులకంటే లోతైన లోయలో పడిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా కల్సి ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సు హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు (HRTC) చెందినదిగా గుర్తించారు. ఈ బస్సు క్వాను-మీనస్ రహదారిపై ప్రయాణిస్తుండగా, నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
తెల్లవారుజామున బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) కమాండెంట్ అర్పణ్ యదువంశీ ఆదేశాల మేరకు డాక్‌పత్తర్, చక్రతా, మోరి, త్యూని పోస్టుల నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. లోయ లోతుగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ, పోలీసులు, స్థానిక పరిపాలన యంత్రాంగం సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కాగా ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని, ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం తెలియరాలేదు.
ఈ విషాద ఘటన పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన డెహ్రాడూన్ జిల్లా మేజిస్ట్రేట్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సమీపంలోని అన్ని మెడికల్ సెంటర్లను 'హై అలర్ట్' మోడ్‌లో ఉంచాలని సీఎం ఆదేశించారు. అలాగే పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హెలికాప్టర్ ద్వారా పెద్ద ఆస్పత్రులకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రమాదానికి గల కారణాలు..
కాగా ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, మంచు- మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రులను వెలికితీసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. గతేడాది ఇలాంటి ఘోర ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఈసారి రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రభుత్వం అత్యంత వేగంగా నిర్వహిస్తోంది.






