ఒకరి అత్యవసరం కోసం బస్సును ఆపడంతో ఆరుగురు దుర్మరణం

by Malleboina Mahesh |

ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఒకరి అత్యవసరం కోసం బస్సును ఆపడంతో ఆరుగురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టడంతో భారీ ప్రమాదం (Huge road accident) చోటు చేసుకుంది. ఇందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా (Six people died) ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం తెల్లవారుజామున జరిగిన చోటు చేసుకుంది. సురీర్ పోలీస్ స్టేషన్ (Surir Police Station) పరిధిలోని మైల్‌స్టోన్ 88 వద్ద సుమారు 2:45 గంటల సమయంలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతివేగంతో వచ్చిన ఒక కంటైనర్ ట్రక్కు అదుపు తప్పి, నిలిపి ఉంచిన ప్రైవేట్ బస్సును, అక్కడ నిలబడి ఉన్న ప్రయాణికులను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు నోయిడా (ఢిల్లీ) నుంచి కాన్పూర్ వెళ్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే బస్సులోని ఒక ప్రయాణికుడు అత్యవసరంగా కిందకు దిగడంతో బస్సును రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. ఆ సమయంలో బస్సు దిగి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ప్రయాణికులను వెనుక నుండి వచ్చిన కంటైనర్ ట్రక్కు (Container truck) వేగంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, అమర్ దూబే అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతులను సోను (ఔరయ్య), దేవేష్ (బస్తీ), గణేష్ (కన్నౌజ్), మరియు సంతోష్ (ఢిల్లీ) గా గుర్తించారు. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘోర ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు, కంటైనర్ డ్రైవర్లు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్ల కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Next Story