- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి!
యూపీలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం! బస్సు-వ్యాన్ ఢీకొని ఆరుగురు మృతి, ఆరుగురికి గాయాలు. ఢిల్లీ నుంచి రాజస్థాన్ వెళ్తుండగా విషాదం.

దిశ, వెబ్ డెస్క్: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న ఒక డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు, ముందు వెళ్తున్న వ్యాన్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా సాదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున సుమారు 4:20 గంటలకు చోటుచేసుకుంది. . ఈ భీకర ప్రమాదంలో ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. ఈ ప్రమాదానికి గురైన వ్యాన్ 13 మంది ప్రయాణికులతో ఢిల్లీలోని ప్రేమ్ నగర్ నుండి రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌కు వెళ్తోంది. ఇదే సమయంలో నోయిడా నుండి గోరఖ్‌పూర్ వైపు వెళ్తున్న స్లీపర్ బస్సు అదుపు తప్పి వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అదనపు ఎస్పీ రామ్ ఆనంద్ కుష్వాహా ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.






