- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్మదాపురంలో ఘోర ప్రమాదం.. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు జలసమాధి
వేగంగా వెళ్తున్న అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పాత భోపాల్-బేతుల్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక కారు, ఇటార్సీ సమీపంలోని పాతరౌత కాలువ వంతెన వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి వేళ కావడం, కాలువలో ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కారులోని వారు బయటపడే అవకాశం లేకపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు జలసమాధి అయ్యారు.
కాగా ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ, రెస్క్యూ టీమ్ కాల్వలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కారును గుర్తించి, అందులో ఉన్న ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.
పాతరౌత కాలువ వద్ద జరిగిన ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. టౌన్ ఇన్‌స్పెక్టర్ సంజీవ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు అదుపు తప్పడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు సంతోషంగా ప్రయాణిస్తున్న వారు ఒక్క క్షణంలో విగతజీవులుగా మారడంతో మృతుల కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది.






