- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: వేగవంతంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఎన్నికలు నిర్వహించే 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఓటర్లు 51,92,220 మంది ఉన్నారు.వీరిలో మహిళలు 25,37,136, పురుషులు 26,54,453, ఇతరులు 631 మంది ఉన్నారు. దీంతోపాటు పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈనెల 16న ఫైనల్ ఓటరు లిస్టును ప్రచురించనున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే 117మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో 2011 జనాభా లెక్కల ప్రకారం 57,41,111 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీలు 2,46,764మంది, ఎస్సీల జనాభా 7,75,653 మంది ఉన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఖరారు చేయనున్నారు. బీసీల రిజర్వేషన్లను మాత్రమే డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఖరారు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.






