నకిలీ పత్తి విత్తనాలతో రైతులకు కలవరం

by Jakkula.Mamatha |

ఖరీఫ్ సాగు సీజన్ నేపథ్యంలో జిల్లా రైతన్నలను నకిలీ పత్తి విత్తనాలు కలవర పెడుతున్నాయి.

నకిలీ పత్తి విత్తనాలతో రైతులకు కలవరం
X

దిశ, ఆసిఫాబాద్: ఖరీఫ్ సాగు సీజన్ నేపథ్యంలో జిల్లా రైతన్నలను నకిలీ పత్తి విత్తనాలు కలవర పెడుతున్నాయి. ప్రతి ఏటా అక్రమార్కులు పక్క రాష్ట్రాల నుంచి వందలాది క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి మన రైతులకు విక్రయిస్తున్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టిన వారి కళ్ళు కప్పి.. దొడ్డిదారిన తీసుకొచ్చి. రైతులకు అంటగడుతున్నారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన..సరైన దిగుబడి రాక తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. గడిచిన రెండు నెలల వ్యవధిలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యూ, ఆసిఫాబాద్, రెబ్బెన, దహెగాం, కొమురవెల్లి ప్రాంతాల్లో పోలీసులు సోదరులు నిర్వహించి సుమారు 25 లక్షలు విలువ చేసే.. 9 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. ఇందులో ఒక్క సిర్పూర్ యూలోనే 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు పట్టుకున్నారు.

ప్రతిఏటా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి..

ప్రతి ఏటా ఖరీఫ్ సాగు సీజన్ కంటే ముందే ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల నుంచి కొందరు అక్రమార్కులు నకిలీ విత్తనాలను తయారు చేసి జిల్లాకు తరలిస్తున్నారు. వీటి నియంత్రణ కోసం పోలీసులు ప్రతిఏటా ప్రత్యేక నిఘా పెట్టి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని. అక్రమార్కులకు పై కేసులు నమోదు చేస్తున్నప్పటికీ..! వారి కళ్ళు కప్పి ఖరీఫ్ సాగు సీజన్ కు రెండు మూడు నెలల ముందుగానే నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి సీక్రెట్ గా నిల్వ చేసి.. దళారులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

నిత్యావసర సరుకుల మాటున తరలింపు..

నకిలీ విత్తనాల తరలింపులో కేటుగాళ్లు కొత్త పంథా ఆలంబిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా వాహనాల్లో తరలిస్తున్నారు. నిత్యావసర సరుకులు బస్తాలు, ఉల్లిగడ్డలు, గడ్డి మాటున ఉంచి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే విత్తనాలు తరలించే వాహనాలకు కారు బైక్ లాంటి వాటిని ఎస్కార్డుగా వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఎక్కడైనా పోలీసు వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే వాహనాన్ని వెనక్కి పంపి మరో దారి గుండా తరలిస్తున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు లేకపోవడంతో పట్టుబడిన కేసులు నమోదైన వారిలో ఎలాంటి మార్పు లేకుండా ఉందనే వాదన ఉంది.

Next Story