రైతులు ప్రత్యామ్నాయ పంటల పై మొగ్గు చూపాలి

by Batti.Sumithra |

రైతులు వరి పంట ఒకటే కాకుండా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల పై మొగ్గు చూపాలని కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటల పై మొగ్గు చూపాలి
X

దిశ, నాగిరెడ్డిపేట్ : రైతులు వరి పంట ఒకటే కాకుండా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల పై మొగ్గు చూపాలని కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో నిర్వహించిన సన్నరకం వడ్ల వేలంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సాగు లక్ష్యం రూ. 5 లక్షల 50వేల ఎకరాలుగా ఉందని, అందులో రూ. 2 లక్షల 30 వేలు ఆరుతడి పంటలు, రూ. 3 లక్షల 23వేల వరిగా సాగు ఉందని. రూ.1 లక్షా 68వేలు వరి పంట, రూ.1 లక్షా 83వేలు ఆరుతడి పంటలు వేశారని ఆయన పేర్కొన్నారు.

జూలై 14వ తేదీ నాటికి జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో 65 శాతం సాగు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో 40 ఎకరాల్లో జనుము, 2 ఎకరాల్లో జిలుగు సాగు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో జూలై 16 నుండి రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రైతులు ఆరుతడి పంటల పై దృష్టిసారించాలని, ఒకే పంటలు కాకుండా వరికి బదులుగా మొక్కజొన్న, కంది వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చన్నారు. జిల్లాలో రూ.3 లక్షల 6 వేల 890మంది రైతుల ఖాతాలో రూ.305.7కోట్లు జమచేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏడీఏ సుధారాణి. విత్తనోత్పత్తి ఏడిఏ ఇంద్రసేన్,సీడ్ అధికారి అశోక్ కుమార్,మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story