వర్షాలతో రైతుల్లో కొత్త ఆశలు.. ఖరీఫ్‌కు శుభారంభం

by Batti.Sumithra |

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో సోమవారం కురిసిన వర్షాలతో రైతుల్లో ఆనందం నెలకొంది.

వర్షాలతో రైతుల్లో కొత్త ఆశలు..  ఖరీఫ్‌కు శుభారంభం
X

దిశ, రెబ్బెన : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో సోమవారం కురిసిన వర్షాలతో రైతుల్లో ఆనందం నెలకొంది. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వర్షం కురవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్ది రోజులుగా తీవ్ర ఎండలు, వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందిన రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వర్షం కురవడంతో వ్యవసాయ పనుల పై రైతుల్లో ఆశలు చిగురించాయి. మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

ముఖ్యంగా ఖరీఫ్ సాగు ప్రారంభానికి అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో రైతులు ఎరువుల కొనుగోళ్ల పై దృష్టి సారించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు రెబ్బెన మండల కేంద్రానికి చేరుకుని ఎరువుల దుకాణాల వద్ద క్యూ కట్టారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర ఎరువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ సాగుకు సన్నద్ధమవుతున్నారు.

Next Story