- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటి నుంచి వెళ్లిపోయిన యువకుడు.. ఆచూకీ కోసం వెతుకులాట
by Batti.Sumithra |
మండలంలోని రేణికుంట గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

X
దిశ, రాజపేట : మండలంలోని రేణికుంట గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రేణికుంట గ్రామానికి చెందిన బుడిగె ప్రవీణ్ (26) ఈ నెల 20వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో ప్రవీణ్ తల్లి బుడిగె మంజుల రాజపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై లింగారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ ఆచూకీ గురించి ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 8712662807 నంబర్‌కు సంప్రదించి సమాచారం అందించాలని ఎస్సై లింగారెడ్డి కోరారు.
Next Story






