మత్తు వదలండి, మైదానాలు చేరండి - మంత్రి వాకిటి శ్రీహరి

by velandi.Saikiran |

'మత్తు వదలండి, మైదానాలు చేరండి' అని రాష్ట్ర యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి యువతకు పిలుపునిచ్చారు.

మత్తు వదలండి, మైదానాలు చేరండి - మంత్రి వాకిటి శ్రీహరి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: 'మత్తు వదలండి, మైదానాలు చేరండి' అని రాష్ట్ర యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి యువతకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ క్రీడా మైదానంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 10.70 కోట్ల తో అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్, కోటి తో నాలుగు ఓపెన్ జిమ్స్, 51 లక్షలతో ఇండోర్ జిమ్, మహిళల అథ్లెటిక్స్ హాస్టల్ మిగిలిన పనుల కోసం 32 లక్షల వ్యయంతో పలు ఆధునిక క్రీడా సదుపాయాల నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ను నిర్మించనున్న ఈ ట్రాక్ ద్వారా జిల్లాలోని యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ అందే అవకాశం కలుగుతుందన్నారు. అదేవిధంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇండోర్ జిమ్ నిర్మాణంతో పాటు నాలుగు అవుట్‌డోర్ జిమ్‌ల ఏర్పాటుకు కూడా శంకుస్థాపన చేశామని, ఈ సదుపాయాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు సమానంగా ఉపయోగపడేలా రూపొందిస్తున్నామన్నారు.

ముఖ్యంగా బాలికల క్రీడా ప్రోత్సాహానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా బాలికల క్రీడల వసతి గృహాల సముదాయం నిర్మాణ పనులకు సైతం శంకుస్థాపన చేశామని, ఇది జిల్లాలో మహిళా క్రీడాకారుల అభివృద్ధికి కీలకంగా మారనుందని. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాకుండా జీవన శైలిని మార్చే శక్తివంతమైన సాధనం అని ఆయన అన్నారు. ప్రతి యువకుడు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో డిల్లీ లో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఏపి జితేంథహదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ జానకి, మేయర్ మమత శ్రీనివాస్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్పీ వెంకటేష్, కార్పోరేటర్ ఉమర్ కొత్వాల్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివైఎస్ఓ రాజశేఖర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story