- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cred: వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా క్రెడ్ ఫౌండర్ కునాల్ షా
కునాల్ షా తన సీఈఓ పదవి నుంచి తప్పుకుని, 'వాట్సాప్' గ్లోబల్ వ్యాపారానికి నాయకత్వం వహించడానికి మెటా గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్‌లో చేరనున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఫిన్‌టెక్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ 'క్రెడ్' సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ద్వారా ఏకంగా రూ. 8,550 కోట్లు భారీ నిధులను సమీకరించినట్లు సోమవారం ప్రకటించింది. ఈ మెగా డీల్‌తో క్రెడ్ కంపెనీ మార్కెట్ విలువ (పోస్ట్-మనీ వాల్యుయేషన్) రూ. 43,239 కోట్లకు చేరింది. అయితే, ఈ ఇన్వెస్ట్‌మెంట్ కంటే మరో అరుదైన గౌరవాన్ని క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా సొంతం చేసుకున్నారు. కునాల్ షా తన సీఈఓ పదవి నుంచి తప్పుకుని, 'వాట్సాప్' గ్లోబల్ వ్యాపారానికి నాయకత్వం వహించడానికి మెటా గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్‌లో చేరనున్నారు. క్రెడ్‌లో తన పర్సనల్ షేర్లను అలాగే కొనసాగిస్తూనే ఆయన ఈ అంతర్జాతీయ బాధ్యతలను తీసుకోనున్నారు. కునాల్ షా నిష్క్రమణతో క్రెడ్ స్ట్రాటజీ అండ్ ఫైనాన్స్ హెడ్ మిటెన్ సంపత్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించారు. ఈ రౌండ్‌లో మెటా కేవలం మైనారిటీ ఇన్వెస్టర్‌గా మాత్రమే ఉంటుందని, కస్టమర్ల డేటాకు ఎలాంటి యాక్సెస్ ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. 2018లో మొదలై, ప్రస్తుతం 1.7 కోట్ల యాక్టివ్ యూజర్లతో దేశంలోని 40 శాతం క్రెడిట్ కార్డ్ బిల్లింగ్స్, రూ. 24,000 కోట్ల లోన్ బిజినెస్‌ను శాసిస్తున్న క్రెడ్.. ఈ కొత్త పెట్టుబడితో సరికొత్త విభాగాల్లోకి విస్తరించడానికి ప్లాన్ చేస్తోంది.






