మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి : ఏసీపీ మాధవి

by Batti.Sumithra |

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, తమ ఉజ్వల భవిష్యత్తును వృధా చేసుకోకూడదని హుజురాబాద్ ఏసీపీ మాధవి సూచించారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి : ఏసీపీ మాధవి
X

దిశ, ​హుజురాబాద్ రూరల్ : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, తమ ఉజ్వల భవిష్యత్తును వృధా చేసుకోకూడదని హుజురాబాద్ ఏసీపీ మాధవి సూచించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు "మత్తు పదార్థాల వినియోగం-దుష్పరిణామాలు" అనే అంశం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ​గంజాయి, సిగరెట్లు వంటి మత్తుపదార్థాలను వినియోగించడం చట్టరీత్యా నేరమని ఏసీపీ స్పష్టం చేశారు. క్షణికానందం కోసం జీవితాలను అంధకారం చేసుకోవద్దని విద్యార్థులకు హితవు పలికారు.

​పెడదారిన పడితే కుటుంబానికి, సమాజానికి నష్టం.. సీఐ కరుణాకర్

​పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ యువత పెడదారిన పడితే వారు మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడి అలవాట్లకు లోనై సమాజానికి హాని కలిగించేలా ప్రవర్తించవద్దని కోరారు.

ఆకర్షణలకు లోనవ్వద్దు : ఇన్చార్జి ప్రిన్సిపాల్ తులసి దాస్..

​కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ తులసి దాస్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వయసులో ఉన్న యువత చెడు అలవాట్లకు త్వరగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ, లక్ష్యం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

​ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు..

​ఇదే వేదిక పై.. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల విధుల్లో పాల్గొని ఉత్తమ సేవలు అందించిన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ​ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విజయేందర్ రెడ్డి, మురళీమోహన్, వాసుదేవరావు, రాజేశం, రాజశేఖర్, మల్లారెడ్డితో పాటు ఇతర అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story