- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం ఓటీటీలోకి టూ బ్లాక్ బస్టర్స్ మూవీస్
ఈ వారం ఓటీటీలోకి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రాబోతున్నాయి.

దిశ, సినిమా: ఈ వారం ఓటీటీ ప్రియుల ముందుకు రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు రాబోతున్నాయి.
బ్లాస్ట్: సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తాజాగా ‘బ్లాస్ట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రీతి ముకుందన్, అభిరామి, జాన్ కొక్కెన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుభాష్ కె. రాజ్ దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా మే 28వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, రిలీజ్ అనంతరం మంచి టాక్‌ను సొంతం చేసుకుని భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకోగా.. జూన్ 25 నుంచి తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.
అవతార్ 3: జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతకావ్యం ‘అవతార్’. ఈ విజువల్ వండర్ నుంచి వచ్చిన రెండు భాగాలు రూ.కోట్లల్లో వసూలు రాబట్టాయి. దీంతో మూడో భాగం ‘అవతార్ - ఫైర్ అండ్ యాష్’ను కూడా గతేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఆడియన్స్‌ను మరో లోకంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు సొంతం చేసుకోగా.. ఈ నెల 24 నుంచి తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.






