పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

by velandi.Saikiran |

బోడుప్పల్‌లోని మల్లయ్యనగర్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్
X

దిశ,మేడిపల్లి: బోడుప్పల్‌లోని మల్లయ్యనగర్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, ఆదివారం సాయంత్రం బోడుప్పల్ మల్లయ్యనగర్ రోడ్ నెం.2, ప్లాట్ నెం.7 వద్ద కొందరు వ్యక్తులు డబ్బులతో మూడు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ జూపల్లి తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దాడి చేశారు. ఈ క్ర‌మంలో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. అరెస్టయిన వారిలో యెడ్ల రవీందర్ రెడ్డి, చల్లా బాలరెడ్డి, అంబటి రాజిరెడ్డి, కామనబోయిన అశోక్ కుమార్, మహ్మద్ అల్తాఫ్, వడ్డె నర్సిములు, బోయ భాస్కర్ ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1,08,150 నగదు, రెండు సెట్ల పేకాట కార్డులు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై తెలంగాణ గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మేడిపల్లి పోలీసులు వెల్లడించారు.

Next Story