- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో పోలీసు పోస్టులపై బీజేఎల్పీ కీలక డిమాండ్
అధికారంలోకి రాకముందు జీవో 46ను రదు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్ధుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు....

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారంలోకి రాకముందు జీవో 46ను రదు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్ధుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు రాకపోవడంతో వేలాది మంది యువత వయోపరిమితి దాటిపోయిందని, ఇతర ఉద్యోగాలకు ఇచ్చిన వయోపరిమితి సడలింపులను పోలీస్ వంటి యూనిఫాం సర్వీసులకు పూర్తి స్దాయిలో వర్తింపజేయకపోవడం యువత భవిష్యత్తతో ఆటలాడటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పలువురు నిరుద్యోగులు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆయనకు వారి సమస్యలను వివరించారు.
ఆ కేసులు వాపస్ తీసుకోండి..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవసరాలకు కేవలం 5వేల కానిస్టేబుల్ పోస్టులు మాత్రమే సరిపోవని, నిరుద్యోగుల డిమాండ్ మేరకు 20 వేల పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ వేయాలని కోరారు. తమకు ఉద్యోగాలని కావాలని శాంతియుతంగా ఆందోళన చేసిన 9 మంది విద్యార్ధులపై ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసును వాపసు తీసుకోవాలని డిమాండ్చేశారు. నారాయణపేట, గద్వాల, ఆదిలాబాద్, నిర్మల్ వంటి వెనకబడిన జిల్లాల యువత కష్టపడి చదివిన అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఆర్మీ నియామకంలో లాంగ్జంప్క్వాలిఫైయింగ్దూరం 3.8 మీట్లరుగా ఉంటే తెలంగాణలో 4 మీటర్లు పెంచడంపై విరుచుక పడ్డారు. ప్రభుత్వం తక్షణమే జీవో 46తో జరిగిన అన్యాయంపై స్పష్టత ఇవ్వాలని, వయో పరిమితి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్చరించారు. నిరుద్యోగ యువత పక్షాన బీజేపీ ఎల్లప్పడు పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.






