- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ గ్రామంలో ఒకే విద్యార్థి... ఒకే ఉపాధ్యాయుడు..!
ఒక విద్యార్థి కోసం ఒక పాఠశాల.. ఒక ఉపాధ్యాయుడి కోసం ఒకే ఒక్క విద్యార్థి..! అనే అరుదైన పరిస్థితి ప్రస్తుతం గాంధీనగర్ తండాలో కనిపిస్తోంది.

దిశ, మేళ్లచెరువు : ఒక విద్యార్థి కోసం ఒక పాఠశాల.. ఒక ఉపాధ్యాయుడి కోసం ఒకే ఒక్క విద్యార్థి..! అనే అరుదైన పరిస్థితి ప్రస్తుతం గాంధీనగర్ తండాలో కనిపిస్తోంది. ఇది ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతోంది. మండలంలోని గాంధీనగర్ తండా ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. వివరాల్లోకి వెళితే మేళ్లచెరువు మండలంలోని గాంధీనగర్ తండా ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడు, ఒకే ఒక్క విద్యార్థితోనే బోధన కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న పరిస్థితికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
తండాలో సుమారు 55 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉండగా, వారిలో ఇద్దరు ఐదో తరగతి పూర్తి చేసి ఈ ఏడాది ఉన్నత పాఠశాలల్లో చేరారు. దీంతో ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న ఒక్క విద్యార్థి మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు హాజరవుతున్నట్లు ఉపాధ్యాయుడు తెలిపారు. ప్రభుత్వం పాఠశాల భవనాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, డిజిటల్ విద్య వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇలాగే తగ్గిపోతే, భవిష్యత్తులో ఇలాంటి పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






