- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణుగూరు ను రక్షించే గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి: ఎమ్మెల్యే కూనంనేని
సింగరేణి ఓసి టు సైడ్ బ్లాక్ ని సింగరేణికే వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

దిశ, మణుగూరు: సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా ఓసి టు సైడ్ బ్లాక్ ని సింగరేణికే వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మణుగూరు అంబేద్కర్ సెంటర్ లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ మణుగూరు దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మణుగూరు ప్రాంత భవిష్యత్తు సింగరేణి అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. ఓసీ-2 డిప్ సెట్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బ్లాక్ సింగరేణికి వస్తే వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు మణుగూరు ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధికి వెన్నెముక వంటిదని, సంస్థ ఒక్కో ప్రాజెక్టును కోల్పోతే తెలంగాణ అంధకారంలోకి నెట్టబడే పరిస్థితులు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ రంగం, ఉపాధి అవకాశాల పరంగా సింగరేణి పాత్ర ఎంతో కీలకమన్నారు.
సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్..
మణుగూరు మనుగడను రక్షించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సింగరేణి విస్తరణ, కొత్త ప్రాజెక్టుల సాధన, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. నిరాహార దీక్షలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మణుగూరు ప్రాంత అభివృద్ధి కోసం ఓసీ-2 డిప్ సెట్ బ్లాక్‌ను సింగరేణికి అప్పగించాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, ఎఐటియు సి బ్రాంచ్ సెక్రటరీ రాంగోపాల్, సిపీఐ రాష్ట్ర నాయకులు సరెడ్డి పుల్లారెడ్డి, దుర్గ్యాల సుధాకర్, సింగరేణి కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని పలువురు నాయకులు ప్రకటించారు.






