- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సందుగూడెం మక్తకుంట కబ్జా యత్నం..
ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.

దిశ, రామచంద్రాపురం: రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్ డివిజన్ సందుగూడెంలోని మక్తకుంట చెరువును కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదులలు రావడంతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం చెరువును పరిశీలించారు. నీటిపారుదల శాఖ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి చెరువును సందర్శించిన ఎమ్మెల్యే ఈ సందర్బంగా మాట్లాడుతూ.. శిఖం భూమి పేరుతో మట్టిని నింపి చెరువును కబ్జా చేసేందుకు ప్రయత్నించడం తగదని అన్నారు. గ్రామానికి అనుసంధానంగా ఉన్న చెరువు కట్ట రహదారిని ధ్వంసం చేయడాన్ని ఖండించారు. చెరువు శిఖం పట్టా భూమిలో వ్యవసాయం చేయవచ్చని, అయితే మట్టిని నింపి చెరువును ఆక్రమించే ప్రయత్నాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెండు రోజుల్లో చెరువు కట్టను పునరుద్ధరించాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, ఈఈ భీమ్, ఏఈ జ్యోతి, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, కొమరయ్య, సీనియర్ నాయకులు రమేష్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.






