అరవిందో కంపెనీపై రైతులు కలెక్టర్‌కు కంప్లైంట్

by Web Desk |

అరవిందో కంపెనీపై రైతులు కలెక్టర్‌కు కంప్లైంట్
X

దిశ, హత్నూర: హత్నూర మండలంలోని బోర్పట్ల శివారులోని అరబిందో కెమికల్ ఫ్యాక్టరీ న్యారటివాని కుంటను ఆక్రమించిందని గ్రామ రైతులు సోమవారం కలెక్టర్ కు కంప్లైంట్ చేశారు. సర్వే నెంబర్ 387 లోని 9 ఎకరాల 25 గుంటల కుంటను ఆక్రమించి స్టీమ్ వాటర్ పైప్ లైన్ అక్రమంగా వేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా కుంట కట్టను చదును చేసి నిర్మాణం చేశారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. కంపెనీపై చర్యలు తీసుకొని కుంటను కాపాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ విట్టల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




Next Story