- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాప్ వినియోగం పై రైతులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
యాప్ వినియోగం పై రైతులకు వ్యాపారులకు అవగాహన కల్పించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ వ్యవసాయ అధికారులకు తెలిపారు.

దిశ, నందిగామ : యాప్ వినియోగం పై రైతులకు వ్యాపారులకు అవగాహన కల్పించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ వ్యవసాయ అధికారులకు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన డీఏపీ యాప్ విధానంతో రైతులు, ఫెర్టిలైజర్ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీని పై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో శనివారం నందిగామలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ రైతులు పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వాడాలో సరైన శాస్త్రీయ అవగాహన లేకుండా వాడుతున్నారని పేర్కొన్నారు.
గతంలో యూరియా దొరకదేమోననే వదంతులతో రైతులు భయాందోళనలకు గురై, పది బస్తాలు అవసరమయ్యే చోట ఇరవై బస్తాలు కొనుగోలు చేసి నిల్వ చేసుకునేవారని గుర్తు చేశారు. ఈ క్రమంలో యూరియా పంపిణీకి యాప్ విధానం తీసుకురావడంతో ఆ సమస్య చాలా వరకు పరిష్కారమైందని ఆయన యూరియా తరహాలోనే ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న డీఏపీ యాప్‌లో అనేక సాంకేతిక లోపాలు (టెక్నికల్ ఎర్రర్స్) తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల డీలర్లు, రైతులు ఎరువులు తీసుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పట్టణ ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పటికీ, సామాన్య రైతులకు స్మార్ట్‌ఫోన్ వినియోగం, యాప్ ద్వారా ఎరువుల వివరాలు నమోదు చేయడం పై ఇంకా పూర్తిస్థాయి అవగాహన రాలేదన్నారు. ప్రతి గ్రామంలో ఆదర్శ రైతులకు శిక్షణ ఇస్తే వారు మిగతా రైతులకు తెలియజేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, బి.నరసింహారావు, ఏడీఏలు మాధవి, సత్యంబాబు, శైలజ, మండల వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






