- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలు.. క్షేత్రస్థాయిలో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ శనివారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పర్యటించారు. టోలిచౌకి, మల్కంపేట చెరువు పరిసర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా సైబరాబాద్ సీపీ రమేష్‌తో కలిసి ట్రాఫిక్ సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై డీజీపీ చర్చించారు. అనంతరం అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు:
ప్రజలకు విజ్ఞప్తి.. ట్రాఫిక్ క్లియరెన్స్
రహదారులపై నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్, విపత్తు నిర్వహణ (DRF) శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల పోలీస్ అధికారులను అప్రమత్తం చేస్తూ, హై అలర్ట్‌లో ఉండాలని సూచించారు. భారీ వర్షాల వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలకు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ కోరారు.






