ఐటీ జాబ్ వదిలి వ్యవసాయ బాట.. పిడుగు పడి రైతు మృతి

by Muthe.Rajitha |

సాఫ్ట్వేర్ జాబ్ వదిలి వ్యవసాయం చేస్తున్న ఓ రైతు ప్రమాదవశాత్తు పిడుగు పడి మరణించిన ఘటన మైసూరులో చోటు చేసుకుంది.

ఐటీ జాబ్ వదిలి వ్యవసాయ బాట.. పిడుగు పడి రైతు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : సమాజంలో మంచి గుర్తింపు, చేతినిండా జీతం ఇచ్చే ఐటీ (IT) ఉద్యోగాన్ని వదిలి, మట్టిపై మమకారంతో వ్యవసాయం వైపు అడుగులు వేసిన ఒక టెకీని విధి వంచించింది. సాగుబాట పట్టి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ యువకుడు, పొలం చూసేందుకు వెళ్లిన చోటే పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకర ఘటన కర్ణాటకలోని మడికేరా పట్టణంలో వెలుగుచూసింది. రోషన్‌ బాలకృష్ణ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ప్రకృతికి దగ్గరగా బతకాలని, సేద్యం చేయాలని నిర్ణయించుకుని ఇటీవల తన ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కేవలం సంప్రదాయ వ్యవసాయమే కాకుండా, తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఒక స్నేహితుడితో కలిసి ఆధునిక వ్యవసాయ పరికరాల మార్కెటింగ్ రంగాన్ని కూడా ప్రారంభించాడు.

ఈ సాగు ప్రణాళికల్లో భాగంగానే, కొత్తగా వ్యవసాయం చేయడానికి మైసూరులో ఓ పొలాన్ని పరిశీలించేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అక్కడ పొలంలో ఉన్న ఒక మామిడి చెట్టు వద్ద పండ్లు కోయడానికి వెళ్లిన సమయంలో, ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపడింది. ఈ ఊహించని ప్రమాదంలో రోషన్ బాలకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతనితో పాటు ఉన్న మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పచ్చని పొలంలో, కళ్ల ముందే కుటుంబ యజమాని ఇలా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి, శోకసముద్రంలో మునిగిపోయింది. ఈ దారుణ ఘటనపై స్పందించిన అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించాయి.

Next Story