బాబాగా మారాలని జననాంగాన్ని నరుక్కున్న రైతు

by Muthe.Rajitha |

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాలో బాబాగా మారేందుకు ఒక 42 ఏళ్ల రైతు గొడ్డలితో తన జననాంగాన్ని నరుక్కున్నాడు.

బాబాగా మారాలని జననాంగాన్ని నరుక్కున్న రైతు
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఒక హృదయవిదారక సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాబాగా మారేందుకు ఒక 42 ఏళ్ల రైతు గొడ్డలితో తన జననాంగాన్ని నరుక్కున్నాడు. మహారాజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విచిత్రమైన, ఘోరమైన ఘటన ఆ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే కుటుంబ బాధ్యతలు, ఆర్థిక భారాల నుండి విముక్తి పొందడానికి 'బాబా'గా మారాలని సదరు రైతు గత కొంతకాలంగా భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పొలంలోని బావి వద్దకు చేరుకుని గొడ్డలితో జననాంగాలను నరుక్కొని, తీవ్ర రక్తస్రావంతో విలవిలలాడుతూనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ అనాలోచిత నిర్ణయం వెనుక సదరు రైతు అనుభవిస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. చాలాకాలంగా భార్య పక్షవాతంతో మంచానికే పరిమితం కాగా.. మరి కొద్దిరోజుల్లో పెద్ద కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉండటంతో, అటు కుమార్తె పెళ్లి భారం, ఇటు భార్య అనారోగ్యం ఆ రైతును కొద్దిరోజులుగా తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో అతనికి చికిత్స నడుస్తోందని, తీవ్ర రక్తస్రావం కావడం వల్ల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Next Story