- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేశ్‌బాబును చుట్టుముట్టిన ఫ్యాన్స్.. బెంగళూరులో భీతావహ వాతావరణం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Kumar) క్రేజ్ సరిహద్దులు దాటింది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) క్రేజ్ సరిహద్దులు దాటింది. బెంగళూరులోని గాంధీనగర్‌లో కొత్తగా నిర్మించిన AMB సినిమాస్ (AMB Cinemas Kapali) మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు వెళ్లిన మహేశ్‌ను కనులారా చూసేంందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, మహేశ్ బాబు వస్తున్నారన్న సమాచారంతో మల్టీప్లెక్స్ పరిసరాల్లో భారీగా ఫ్యాన్స్ వేచి చూశారు. మహేశ్ కారు దిగగానే ఒక్కసారిగా అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. సూపర్ స్టార్.. సూపర్ స్టార్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. ఫ్యాన్స్ తోపులాట పెరగడంతో మహేశ్‌ను సురక్షితంగా లోపలికి తీసుకెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చినట్లుగా సమాచారం.
ఈ సందర్భంగా మహేశ్ బాబు సోషల్ మీడియా (Social Media) ద్వారా స్పందిస్తూ.. నమ్మ బెంగళూరులో AMB సినిమాస్ తలుపులు తెరుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతటి అద్భుతమైన థియేటర్‌ను సిద్ధం చేసిన టీమ్ మొత్తానికి నా అభినందనలు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.






