వైభవ్ ఇంటికి పోటెత్తిన అభిమానులు

by Muthe.Rajitha |   (  Updated:2026-06-03 15:01:28  IST  )

IPL 2026 లో తన సంచలన బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీకి సొంత గడ్డపై బ్రహ్మరథం పడుతున్నారు.

వైభవ్ ఇంటికి పోటెత్తిన అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో తన సంచలన బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన 15 ఏళ్ల యువ క్రికెట్ అద్భుతం వైభవ్ సూర్యవంశీకి సొంత గడ్డపై బ్రహ్మరథం పడుతున్నారు. ఐపీఎల్ ముగించుకుని బీహార్‌లోని తన సొంత ఊరైన సమస్తిపూర్ జిల్లా, తాజ్‌పూర్ గ్రామానికి వైభవ్ చేరుకున్న నేపథ్యంలో, నయా సూపర్ స్టార్‌ను చూసేందుకు గ్రామస్తులు, అభిమానులు వైభవ్ ఇంటికి క్యూ కట్టారు. తమ ప్రాంతం నుండి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ క్రికెటర్‌తో సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. దాంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఐపీఎల్‌లో మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించి, రికార్డులను తిరగరాసినప్పటికీ.. వైభవ్ తన మూలాలను మరువలేదు. తన సాధారణఇంటికి వచ్చిన అభిమానులందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో సమయం గడిపాడు.

సౌరభ్ గంగూలీ సెక్యూరిటీ తగ్గింపు

Next Story