RRRకు షాక్.. బ్యాన్ చేయాలంటూ అభిమానుల డిమాండ్..

by Disha Web Desk 19 |
RRRకు షాక్.. బ్యాన్ చేయాలంటూ అభిమానుల డిమాండ్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజామౌళి దర్శకత్వంలో.. స్టార్ యాక్టర్స్ రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు అగ్ర నటులు కలిసి నటించడంతో వారి అభిమానులు సినిమా విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. ఆర్ఆర్ఆర్ సినిమాను కర్నాటకలో బ్యాన్ చేయాలని కన్నడ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం ఈ సినిమాను కన్నడ భాషలో తక్కవ థియేటర్‌లలో విడుదల చేయడం.

కన్నడ భాషను అవమానపరిచేలా తక్కువ స్ర్కీన్‌లలో కన్నడ భాషలో ఈ సినిమాను విడుదల చేస్తున్నరంటూ.. ట్వీట్టర్‌లో #Boycottinkarnataka అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు కన్నడ అభిమానులు. ఇదిలా ఉండగా.. మరి కొందరు ఫ్యాన్స్ కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా 'జేమ్స్' ప్రస్తుతం థియేటర్‌లలో ప్రదర్శించబడుతుంది. అయితే మార్చి 25న ఆర్ఆర్ఆర్ విడుదల అయితే జేమ్స్ సినిమా రన్ అవుతున్న థియేటర్లను ఆర్ఆర్ఆర్ ఆక్యూపై చేస్తుందని పునీత్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరో రెండు రోజుల్లో సందడి చేయబోతున్న ఈ సినిమాకు అభిమానులు షాక్ ఇస్తున్నారు. ప్రస్తుతం ట్వీట్టర్‌లో #Boycottinkarnataka హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.


Next Story

Most Viewed