ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెల్ షీట్స్ ఆత్మహత్య

by Malleboina Mahesh |   (  Updated:2026-04-23 08:50:33  IST  )

ప్రముఖ రియాలిటీ టీవీ స్టార్ డారెల్ షీట్స్ (67) ఆరిజోనాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 'స్టోరేజ్ వార్స్'లో 'గ్యాంబ్లర్'గా ఆయన గుర్తింపు పొందారు.

ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెల్ షీట్స్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్, 'స్టోరేజ్ వార్స్' (Storage Wars) ఫేమ్ డారెల్ షీట్స్ (67) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆరిజోనాలోని లేక్ హవాసు సిటీలో ఉన్న తన నివాసంలో ఆయన శవమై కనిపించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం (ఏప్రిల్ 22, 2026) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

'గ్యాంబ్లర్'గా గుర్తింపు..

డారెల్ షీట్స్ హాలీవుడ్ రియాలిటీ షో 'స్టోరేజ్ వార్స్' ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2010 నుంచి 2023 వరకు సుమారు 160 కి పైగా ఎపిసోడ్లలో ఆయన నటించారు. వేలంలో రిస్క్ తీసుకుని పెద్ద మొత్తంలో బిడ్లు వేసే ఆయన శైలికి ముగ్ధులైన ప్రేక్షకులు ఆయనను 'గ్యాంబ్లర్' (The Gambler) అని పిలిచేవారు. 2019లో గుండెపోటు రావడంతో ఆయన టీవీ రంగానికి కొంత విరామం ఇచ్చి ఆరిజోనాకు మారారు. అక్కడ ఆయన ఒక యాంటిక్ (పురాతన వస్తువుల) స్టోర్‌ను నిర్వహిస్తున్నారు.

రూ. 34 కోట్ల ఆస్తి..

ముప్పై ఏళ్లకు పైగా స్టోరేజ్ వేలం వ్యాపారంలో ఉన్న డారెల్ షీట్స్, సుమారు 4 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 34 కోట్లు) ఆస్తిని కూడబెట్టినట్లు సమాచారం. ఆయన మృతిపై ఆరిజోనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డారెల్ మృతి వార్త విన్న ఆయన అభిమానులు, తోటి నటులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 30 ఏళ్లకే గుండెపోటుతో హీరోయిన్ మృతి

Next Story