ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 30 ఏళ్లకే గుండెపోటుతో హీరోయిన్ మృతి

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-23 08:49:47  IST  )

ఘజియాబాద్‌లోని తన నివాసంలో ఉన్న సమయంలో దివ్యాంకకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 30 ఏళ్లకే గుండెపోటుతో హీరోయిన్ మృతి
X

దిశ, సినిమా: హర్యానా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ నటి, డ్యాన్సర్ దివ్యాంక సిరోహి ఆకస్మిక మరణం అందరినీ కలిచివేస్తోంది. కేవలం 29 ఏళ్ల వయసులోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అభిమానులను, సినీ ప్రముఖులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ యంగ్ బ్యూటీ, ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఘజియాబాద్‌లోని తన నివాసంలో ఉన్న సమయంలో దివ్యాంకకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. కాగా.. సుమారు 50కి పైగా హర్యానా మ్యూజిక్ వీడియోలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. 'మేరీ మమ్మీ ను పసంద్ నీ తూ' అనే సాంగ్‌తో ఆమె ఓవర్‌నైట్ స్టార్‌గా మారారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. నటిగా మారకముందు ఆమె ఒక సాధారణ ఉద్యోగం చేసేవారు. కానీ కళపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి మాసూమ్ శర్మ, అమిత్ సైనీ వంటి టాప్ సింగర్స్‌తో కలిసి పనిచేశారు.ఇక దివ్యాంక మృతి పట్ల ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆమె ప్రతిభావంతురాలైన నటి అని, ఆమె లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని పేర్కొంది. ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు బాలీవుడ్, హర్యానవీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి తన స్వయంకృషితో ఇంతటి గుర్తింపు తెచ్చుకుని ... ఎంతోమంది ఫాలోవర్స్‌ను రాబట్టుకున్న ఆమె మరణంపై నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెల్ షీట్స్ ఆత్మహత్య

Next Story